Jun 02,2023 00:17

వధూవరులను ఆశీర్వదిస్తున బూచేపల్లి వెంకాయమ్మ

ప్రజాశక్తి-దర్శి : దర్శిలోని పిజిఎన్‌ కల్యాణ మండపంలో వైసిపి నాయకుడు, నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు సద్దిపుల్లారెడ్డి కుమార్తె డాక్టరు తేజస్వి, డాక్టరు మల్లారెడ్డి వివాహవేడుకలు గురువారం నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లాపరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, ఉడుముల శ్రీనివాసరెడ్డి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి మాజీ చైర్మన్‌ కెవిరెడ్డి, మాజీ ఎంపిపిలు వీరగంధం కోటయ్య, మధుసూధనరెడ్డి, ఇత్తడి దేవదానం, కాకర్ల కృష్ణారెడ్డి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు కీసరి రాంభూపాల్‌రెడ్డి, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.