Jul 29,2021 23:49

రామారావు కుటుంబీకులతో మాట్లాడుతున్న నారాయణ

కలెక్టరేట్‌ : తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ సెవెన్‌ హిల్స్‌ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఎఐటియుసి జాతీయ ఉపాధ్యక్షులు వివి.రామారావును సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ గురువారం పరామర్శించారు. రామారావు ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లనడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పరామర్శించిన వారిలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి.సత్యనారాయణమూర్తి, ఎఐటియుసి నాయకులు డి.ఆదినారాయణ, జి.ఓబులేసు, ఆర్‌ రవీంద్రనాధ్‌, మరుపిళ్ల పైడిరాజు, జె రామకృష్ణ ఉన్నారు.