Jan 14,2021 19:55

హైదరాబాద్‌: అబ్జెక్షన్‌ యువరానర్‌.., కోర్టులో వాదించటమూ వచ్చు..కోటు తీసి కొట్టడమూ వచ్చు.. అంటూ వకీల్‌సాబ్‌ టీజర్‌ వచ్చేసింది. పవన్‌కళ్యాణ్‌ నటిస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. సంక్రాంతి సందర్భంగా చిత్ర యూనిట్‌ టీజర్‌ను విడుదల చేసింది. హిందీ చిత్రం 'పింక్‌'కు ఇది రీమేక్‌. ప్రస్తుతం పవన్‌ నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. దిల్‌రాజు నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.