Jul 29,2021 22:20

తహశీల్దార్‌ కు వినతిపత్రం అందజేత

తహశీల్దార్‌ కు వినతిపత్రం అందజేత

వక్ఫ్‌ బోర్డు భూములు కాపాడాలి
ప్రజాశక్తి-ఉదయగిరి:మండల పరిధిలోని వక్ఫ్‌ బోర్డు భూములు అన్యాక్రాంతం కాకుండా రక్షించాలని మండల అవాజ్‌ కమిటీ సభ్యులు తహశీల్దార్‌ ఎన్‌ శ్రీనివాసులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వక్ఫ్‌ బోర్డు భూములు కాపాడాలనే ఉద్దేశంతో వక్ఫ్‌ బోర్డు ఎన్ని చట్టాలను తీసుకవచ్చిన స్థలాలు గుర్తింపు లేక అక్రమణ దారులు సర్వే నంబర్లు తారుమరులు చేసి అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. ఆ స్థలాలు గుర్తించి వాటిని సంరక్షించే విధంగా కంచెలు ఏర్పాటు కల్పించి రక్షించాలని కోరారు. అనంతరం తహశీల్దార్‌ కు వినతిపత్రం అందజేశారు
కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కాకు.వెంకటయ్య, ఐద్వా నాయకురాలు కామక్ష్మమ్మ, అవాజ్‌ కమిటీ అధ్యక్షులు,పరిద్దిన్‌, కార్యదర్శి నాయబ,్‌ సభ్యులు బాషమోహిద్దీన్‌, ఫరిద్‌ సాహెబ్‌, ఖాజావాలి, ఆక్రమ్‌, చిన్నఫరిద్‌, బషీర్‌, పాల్గొన్నారు.