
నివాళులర్పిస్తున్న మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
ప్రజాశక్తి-పొదిలి : పొదిలికి చెందిన వక్ఫ్‌బోర్డు చైర్మన్ ముల్లా షుకూర్‌కు మాతృవియోగం కలిగింది. ఆయన మాతృమూర్తి మెహరున్నీషా ఆదివారం మృతిచెందారు. మార్కాపురం మాజీ ఎమ్మెల్యే, వైసిపి జిల్లా అధ్యక్షుడు జంకె వెంకటరెడ్డి, టిడిపి నియోజక వర్గ ఇన్‌ఛార్జి, మాజీ కందుల నారాయణరెడ్డి, కంభం మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాస రెడ్డి తదితరులు మోహరున్నీషా భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో పలువురు టిడిపి, వైసిపి నాయకులు ఉన్నారు.