Oct 18,2020 01:07

మల్లాంలో మాట్లాడుతున్న దడాల సుబ్బారావు

భారత కమ్యూనిస్టు పార్టీ శత వసంతాల సభల్లో వక్తలు
వాడవాడలా అరుణ పతాకావిష్కరణలు
ప్రజాశక్తి - యంత్రాంగం భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సిపిఎం ఆధ్వర్యంలో జిల్లాలోని 58 కేంద్రాల్లో శనివారం అరుణ పతాకావిష్కరణలు జరిగాయి. ఈసందర్భంగా జరిగిన సభల్లో నాయకులు మాట్లాడారు. పిఠాపురం మండలంలోని మల్లాం గ్రామంలో జరిగిన సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు దడాల సుబ్బారావు మాట్లాడారు. దేశంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడిన మొదలు ఈ 100 ఏళ్లలో స్ఫూర్తిదాయకమైన అనేక ఉద్యమాలను నిర్వహించిందన్నారు. దేశంలో భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు నిర్వహించి లక్షలాది ఎకరాల భూమిని పంపిణీ చేసిందన్నారు. ఆ పోరాట వారసత్వాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. జిల్లా కమిటీ సభ్యులు కె.సింహాచలం మాట్లాడారు. నాయకులు దడాల నాగ వెంకటలక్ష్మి, రండ అప్పారావు, దుగ్గడ చినవీర్రాజు, పల్లపు సుబ్బారావు, పి.సూర్యప్రకాష్‌, చెక్క ఏసుబాబు, ఎస్‌.జగదీష్‌ పాల్గొన్నారు. రామా థియేటర్‌ సెంటర్‌లో నాయకులు ఎం.సూరిబాబు మాట్లాడారు. నాయకులు కె.విశ్వనాథం, జిఎస్‌.భాస్కర్‌, పి.సూర్య చక్రం, గొల్ల నెరియ్య, సత్తిబాబు, సూర్యనారాయణ, సోమేశ్వరరావు, విష్ణు, గోపాలకృష్ణ, నాగేశ్వరరావు పాల్గొన్నారు. కాకినాడ సుందరయ్య భవన్‌లో నాయకుడు కె.వీరబాబు అధ్యక్షతన జరిగిన సభలో పార్టీ జిల్లా కార్యదర్శి కె.ఎస్‌.శ్రీనివాస్‌, కార్యదర్శివర్గ సభ్యులు దువ్వ శేషబాబ్జి, ఎం.వీరలక్ష్మి మాట్లాడారు. నాయకులు సిహెచ్‌.అజరుకుమార్‌, సిహెచ్‌.రమణి, టి.రాజా, పి.వీరబాబు, సూర్య, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. వలసపాకల సెంటర్లో నాయకుడు ఎంవి.రమణ అధ్యక్షతన జరిగిన సభలో డి.శేషబాబ్జి మాట్లాడారు. నాయకులు పి.వీరబాబు, ఎవి.కృష్ణాజీ, వి.సత్తిబాబు, ఎ.సత్యనారాయణ, గంగారావు, సింహాచలం, చంద్రరావు పాల్గొన్నారు. జిజిహెచ్‌ ద్వారం వద్ద కార్మికుల సమక్షంలో సీనియర్‌ కార్మికురాలు కోన లక్ష్మీ అరుణ పతాకావిష్కరణ చేశారు. నాయకులు పి.వీరబాబు మాట్లాడారు. సిహెచ్‌.విజరు కుమార్‌, కల్యాణ్‌, ఎస్‌.వాసు, పి.జానకీరామారావు, గజేంద్ర, జనార్ధన్‌, కామేశ్వరి, సుబ్బలక్ష్మి, వీరబాబు, జ్యోతి, కమల, మంగరాజు, బాబ్జి పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలోని నందంగనిరాజు సెంటర్‌, శ్యామలా సెంటర్‌, రాజా థియేటర్‌ సెంటర్‌, క్వారీ సెంటర్‌, పేపర్‌మిల్లు ఏరియాల్లో జరిగిన సభల్లో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు టిఎస్‌. ప్రకాష్‌, ఎస్‌ఎస్‌.మూర్తి మాట్లాడారు. నాయకులు పి.వెంకటేశ్వరరావు, టి.సావిత్రి, పి.తులసి, బి.రాజులోవ, బి.పూర్ణిమరాజు, కె.సురేష్‌, ఐ.సుబ్రహ్మణ్యం, వి.ప్యారీలింగం, కె.రామకృష్ణ, జి.భాస్కర్‌, జి.తాతారావు, ప్రకాష్‌, ఎం.శ్రీనివాస్‌రావు, ఎస్‌.వెంకటేశ్వరరావు, ఎస్‌.జి.కృష్ణ, అభిమన్యు, ఎంఎస్‌.రావు పాల్గొన్నారు. లాలా చెరువులోని ప్రజాశక్తి స్వరూప్‌ నగర్‌ శాఖల ఆధ్వర్యంలో జరిగిన సభలో టిఎస్‌.ప్రకాష్‌, మేనేజర్‌ డి.శ్రీనివాస్‌ మాట్లాడారు. ఈకార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర నాయకులు టి.సావిత్రి, సిబ్బంది సిహెచ్‌.త్రినాధ్‌, మంజన్‌కుమార్‌, భూషణం, నాగమల్లిక, లక్ష్మి, నాగేంద్ర, సన్నీ, సంపత్‌ పాల్గొన్నారు. యానాంలోని పాత బస్టాండ్‌ వద్ద సభలో నాయకులు దుర్గాప్రసాద్‌ మాట్లాడారు. నాయకులు కెవివి.సత్యనారాయణ, వై.శ్రీనివాసరావు, ఎ.వెంకటరమణ, కాకి శ్రీనివాస్‌, కె.కృష్ణ, పిల్లి దుర్గాప్రసాద్‌, ఎం.శ్రీనివాసరావు, పి.హరిబాబు, పి.నరేష్‌ పాల్గొన్నారు. ముమ్మిడివరంలోని పార్టీ కార్యాలయం వద్ద సభలో నాయకులు పాము బాలయ్య, సకిలే సూర్యనారాయణ, డివి.రాఘవులు మాట్లాడారు. నాయకులు జి.కృష్ణమూర్తి, గెడ్డం సత్యనారాయణ పాల్గొన్నారు. అయినాపురంలో శాఖా కార్యదర్శి జె.నాగేశ్వరరావు మాట్లాడారు. నాయకులు బి.వెర్రియ్య, సాయిబాబు, ఎం.చినసత్యనారాయణ, పి.మోహన్‌, కాశి శ్రీనివాసరావు, జి.కుమారస్వామి, వజ్రపు వెంకటేశ్వరరావు, టి.రమణ, పి.నాగేశ్వరరావు పాల్గొన్నారు. చింతూరులోని పార్టీ కార్యాలయం వద్ద సభలో నాయకులు యర్రంశెట్టి శ్రీనివాస్‌ మాట్లాడారు. నాయకులు ఎస్‌.సురేష్‌, పి.వెంకట్‌, పి.లక్ష్మణ్‌, పాండ్రు సుబ్బారావు, ఎం.రంగమ్మ, పి.పొద్దయ్య, కె.రాజయ్య, మహేష్‌ పాల్గొన్నారు. రాజవొమ్మంగిలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు లోతా రామారావు, నాయకులు సింగిరెడ్డి అచ్చారావు మాట్లాడారు. నాయకులు టి.శ్రీను, బి.బాబూరావు, కె.జగన్నాథం, పి.రామరాజు, చిర్లం ధర్మరాజు, వి.ఎర్రబ్బాయి, జె.వెంకటరమణ, ఎం.ప్రసాద్‌, చక్రం పాల్గొన్నారు. పెద్దాపురంలో జరిగిన సభలో డి.కృష్ణ మాట్లాడారు. నాయకులు కె.అప్పన్న, సత్తిబాబు, కె.నాగు, ఎస్‌.శ్రీనివాస్‌, డి.సత్యనారాయణ, కె.అరుణ, అనంతలక్ష్మి, నరసింహమూర్తి, వీర్రాజు, రాంబాబు, రమేష్‌, పెంటయ్య, సుబ్బలక్ష్మి పాల్గొన్నారు. కడియంలోని పేపర్‌మిల్లు వద్ద సభలో నాయకులు జి.సాయిబాబు మాట్లాడారు. నాయకులు సాగర్‌, సత్యనారాయణ, శ్రీను, సుబ్బారావు, కోటేశ్వరరావు, కనకరాజు, చిన్నారావు. పాల్గొన్నారు. ప్రత్తిపాడు మండలం ఏలూరులోని వారధి గట్టు వద్ద సభలో నాయకులు రొంగల ఈశ్వరరావు మాట్లాడారు. నాయకులు పి.శ్రీను, కె.సతీష్‌, పి.కిరణ్‌, కె.ఆశీర్వాదం, ఆర్‌.బాబూరావు, వి.నాగేశ్వరరావు పాల్గొన్నారు. రాజోలు సెంటర్లో జరిగిన సభలో నాయకులు పీతల రామచంద్రరావు మాట్లాడారు. నాయకులు బి.సత్యనారాయణ, తాడి శ్రీరాముర్తి, డి.సుబ్రహ్మణ్యం, బి.పర్వతాలు పాల్గొన్నారు. అమలాపురం మండలంలోని కామనగరువు, వన్నె చింతలపూడి, తాండవపల్లి, బండారులంక, భట్నవిల్లి, జనుపల్లిలో జరిగిన సభల్లో డివిజన్‌ కార్యదర్శి కె.వెంకటేశ్వరరావు మాట్లాడారు. నాయకులు పి.వసంత కుమార్‌, బి.శ్రీను, టి.నాగవరలక్ష్మి, ఎస్‌.రాజు, జి.దైవవాణి, గణేష్‌, రాజ్‌ కుమార్‌, ఆనంద్‌, మధు, శ్రీను పాల్గొన్నారు. కరపలోని భవన నిర్మాణ కార్మిక సంఘం భవనం వద్ద సభలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.వీరలక్ష్మి మాట్లాడారు. ఈకార్యక్రమంలో త్రిమూర్తులు, సురేష్‌, రామ్‌ప్రసాద్‌ పాల్గొన్నారు. అయినవిల్లి మండలం తొత్తరమూడిలోని పెదపాలెంలో సభలో నాయకురాలు కె.రాఘవమ్మ మాట్లాడారు. తాళ్లరేవు మండలంలోని కోరంగి పంచాయతీ సీతారాంపురం, తాళ్లరేవు సంతపేట, చెరువుగట్టు సెంటర్‌, సుంకటరేవు ప్రాంతాల్లో నాయకులు టి.ఈశ్వరరావు, వి.రాజుబాబు, జి.దుర్గాప్రసాద్‌, డి.అదృష్టదీపుడు, కెవివి.సత్యనారాయణ మాట్లాడారు. నాయకులు వై.అప్పాయమ్మ, ఎన్‌.త్రిమూర్తులు, ఆర్‌.సత్య నారాయణ, పి.ఈశ్వరరావు, జి.చిన్నయ్య, జి.రమణ, పోశయ్య పాల్గొన్నారు.