Aug 06,2022 23:27

ఆందోళన చేస్తున్న నాయకులు

ప్రజాశక్తి-డుంబ్రిగుడ:మండలంలోని కితలంగి పంచాయతీ పరిశీల రోడ్డు సంపంగి గెడ్డ వద్ద వంతెన నిర్మించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదని టిడిపి అరకు పార్లమెంట్‌ కోశాధికారి నాగేశ్వరరావు తెలిపారు. శనివారం సంపంగి గెడ్డ వద్ద వంతెన నిర్మించాలని కోరుతూ టిడిపి నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హుదూత్‌ తుఫానుకు కొట్టుకుపోయినా వంతెన నిర్మించడంలో అధికారులు నిర్లక్ష్యం చేయడం విచారకరమన్నారు. ఈ వంతెనకు ఆనుకొని సుమారు నాలుగు మండలాల గ్రామాల గిరిజనులకు రవాణా సౌకర్యం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుబ్బారావు, భాస్కరరావు, ప్రసాద్‌ పాల్గొన్నారు.