
నృహింస సంస్థ అందజేసిన నిత్యావసరాలు, దుస్తులతో బాధితులు
ప్రజాశక్తి - ఎటపాక : గోదావరి వరదలతో ఎంతో మంది ఆకలితో అలమటిస్తుండగా, అభాగ్యులకు అండగా మేమున్నామంటూ నృసింహ సేవా వాహిని సంస్థ ముందుకొచ్చింది. సంస్థ వ్యవస్థాపకులు కృష్ణ చైతన్య ఆధ్వర్యాన శనివారం ముంపు మండలాల్లో 5వేల కుటుంబాలకు నిత్యావసర సరుకులు, దుస్తులు అందజేశారు. ఎటపాక, చింతూరు, విఆర్.పురం, కూనవరం మండలాలలో సంస్థ ఆధ్వర్యంలో వీటిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు ప్రభాకర్, పురుషోత్తం, ఈశ్వరరావు, గద్దల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.