Sep 14,2021 10:42

న్యూఢిల్లీ  : ఢిల్లీలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వరదనీటికి సౌత్‌ ఢిల్లీలోని అద్చిని ప్రాంతంలో రోడ్డు 10 అడుగుల మేర కుంగిపోయింది. ఈ రోడ్డు 25 అడుగుల వెడల్పు, 10 అడుగుల లోతున కుంగిపోవడంతో.. ఒక బస్సు దానిలో ఇరుక్కుపోయింది. ఈ సమయంలో డిటిసి బస్సు ఆ రోడ్డు మీదుగా వెళుతూ ఆ గొయ్యిలో పడిపోయింది. క్రేన్‌ సాయంతో ఆ బస్సును బయటకు తీశారు. అదే రోడ్డున వెళుతున్న బైక్‌, స్కూటీ కూడా ఆ గొయ్యిలో పడిపోయాయి. అప్రమత్తమైన స్థానికులు వాహనదారులను కాపాడారు. బస్సులో ఉన్న 30 మందికి పైగా ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే ఎమ్మెల్యే సోమనాథ్‌ భారతి, పోలీసులు, పిడబ్ల్యుడి సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

వరదకు కుంగిన రోడ్డు.. కూరుకుపోయిన బస్సు!