
కోలీవుడ్ హీరో విజయ్ దళపతి ప్రస్తుతం డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'వారసుడు' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్‌రాజు ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిరిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. బుధవారం విజరు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి వరుస అప్డేట్లను చిత్రబృందం విడుదల చేస్తోంది. మంగళవారం ఈ సినిమా ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌ను రిలీజ్ చేయగా, బుధవారం సెకెండ్, థర్డ్ లుక్‌లను రిలీజ్ చేసింది. విజయ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.