Nov 21,2020 21:13

న్యూఢిల్లీ : వరుసగా రెండోరోజూ పెట్రో ధరలు పెరిగాయి. శనివారం పెట్రోల్‌పై 15 పైసలు, డీజిల్‌పై 20 పైసలు పెరిగినట్లు ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల నోటిఫికేషన్‌ పేర్కొంది. తాజా పెరుగుదలతో ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ.81.23 నుంచి రూ.81.38కి, డీజిల్‌ ధర రూ.70.68 నుంచి 70.88కు పెరిగిందని తెలిపింది. ఆయా రాష్ట్రాల్లో స్థానికంగా ఉండే అమ్మకపు పన్ను, విలువ ఆధారిత పన్ను (వ్యాట్‌) ఆధారంగా ధరల్లో తేడాలు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. దాదాపు రెండు నెలల విరామం తర్వాత శుక్రవారం పెట్రో ధరల్లో స్వల్పంగా మార్పులు చేసిన విషయం తెలిసిందే. పెట్రోల్‌పై 17 పైసలు, డీజిల్‌పై 22 పెసలు పెంచారు.