Mar 19,2023 19:43

పంపిణీ చేసిన నూతన వస్త్రాలతో వృద్ధులు

ప్రజాశక్తి - జామి : వృద్ధులు సమాజానికి అందించి న సేవలు నేటి తరం యువత మరచి పోకూడదని, వృద్ధులను గౌరవంగా చూడవ లసిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా సెట్విజ్‌ అధికారి బి.రామ గోపాల్‌ అన్నారు. అట్టాడ బి.ఎన్‌.ఆర్‌. అశ్రమం మూడోవ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ బి.ఎన్‌.ఆర్‌.అశ్రమంలో వృద్ధులకి ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించడం తనకి ఎంతో ఆనందం కలిగిందన్నారు. గ్రామీణ ప్రాంతా ల్లో వృద్ధులను ప్రభుత్వం ఆదుకోవడానికి తగిన చర్యలు తీసుకొంటుందని ఆయన అన్నారు, జిల్లా సైనిక్‌ సంక్షేమ శాఖ అధికారి మజ్జి కృష్ణారావు మాట్లాడుతూ వృద్ధులకు సేవలు అందించడం గొప్పగా భావించాల న్నారు. మూడోవ వార్షికోత్సవం సందర్భంగా ప్రముఖ పారిశ్రామిక వేత్త డి.ఎస్‌.టి. నాయుడు, సుస్మా దంపతులు వృద్ధులకి నూతన వస్త్రాలు అందచేశారు. మాతృభూమి సేవా సంఘం ఆధ్వర్యంలో పోజిటివ్‌ ప్రతిని ధులకి పౌష్టికాహారం అందచేశారు. ఈ కార్యక్రమంలో సమన్విత ఏజన్సీ అధినేత గోలుగూరి నాగిరెడ్డి, మాతృభూమి సేవా సంఘం గోపీ, విజయ పోజిటీవ్‌ నెట్‌ వర్క్‌ మజ్జి పద్మావతి, నరసింగరావు మాస్టారు, అశ్రమం నిర్వాహకుడు భీశెట్టి ఆధిబాబు, శారదా, డాక్టర్‌ బాల భార్గవి, భవ్య, ఆశా, సాయి, శిరీష, లోకేష్‌ కుమార్‌, కొండబాబు, మీనా, స్రవంతి, అలమండ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్‌ తేజస్విరెడ్డి పాల్గొన్నారు.