న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద గ్రనేడ్ కలకలం

Mar 3,2024 14:44 #newyork
న్యూయార్క్ లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ వద్ద శనివారం బాంబు కలకలం సృష్టించింది. ఓవైపు యాంటీ ఇజ్రాయెల్ నిరసనకారుల ప్రదర్శన, మరోవైపు కారులో బాంబు ఉందంటూ ఫోన్ కాల్ రావడంతో న్యూయార్క్ పోలీసులు ఘటనాస్థలానికి  చేరుకున్నారు. ఈ క్రమంలో బాంబ్ స్క్వాడ్ కారును నిరసనకారులు అడ్డుకోవడంతో టెన్షన్ నెలకొంది. నిరసనకారులు ఎక్కువ మంది ఉండడంతో పోలీసులు అదనపు బలగాలను రప్పించారు. ఆ తర్వాత కారుకు అడ్డుపడుతున్న వాళ్లను పక్కకు లాగేస్తూ ముందుకెళ్లారు. ఉబర్ కారులో గ్రనేడ్ ను గుర్తించి, నిర్వీర్యం చేసినట్లు న్యూయార్క్ పోలీస్ డిపార్ట్ మెంట్ ప్రకటించింది. అదేవిధంగా పోలీస్ కారును అడ్డుకున్న నిరసనకారులను అరెస్టు చేసి జైలుకు పంపినట్లు తెలిపింది.
➡️