సియోల్‌లో డాక్టర్ల భారీ ర్యాలీ

Mar 4,2024 11:26 #Doctors, #huge rally, #Seoul

సియోల్‌ : మెడికల్‌ స్కూల్‌ అడ్మిషన్ల సంఖ్యను భారీగా పెంచాలన్న ప్రభుత్వ .యోచనకు వ్యతిరేకంగా గత రెండు వారాలుగా సమ్మె చేస్తున్న జూనియర్‌ డాక్టర్లకు మద్దతుగావేలాది మంది సీనియర్‌ వైద్యులు ఆదివారం సియోల్‌లో ర్యాలీ నిర్వహించారు జూనియర్‌ డాక్టర్లు తమ సమ్మె విరమించి తక్షణమే విధుల్లోకి చేరాలని, లేని పక్షంలో వారి మెడికల్‌ లైసెన్స్‌లను రద్దు చేస్తామని ప్రభుత్వం బెదిరింపులకు దిగిన నేపథ్యంలో సీనియర్‌ వైద్యులు ఈ ర్యాలీ నిర్వహించారు.ప్రభుత్వ అసంబద్ధమైన వైద్య విధానాన్ని ట్రైనీ వైద్యులు , వైద్య విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దయచేసి బెదిరింపులు, అణచివేతను ఆపండి.” అని కొరియా మెడికల్‌ అసోసియేషన్‌లో సీనియర్‌ సభ్యుడు పార్క్‌ సంగ్‌-మిన్‌ ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ పథకాన్ని విమర్శిస్తూ నిరసనకారులు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ర్యాలీ సందర్భంగా ఎక్కడా ఎలాంటి అవాంచనీయ సంఘటన చోటుచేసుకోలేదు. చాలా క్రమశిక్షణా యుతంగా ర్యాలీ జరిగింది. సమ్మె చేస్తున్న జూనియర్‌ డాక్టర్లు మొత్తం వైద్యులలో 30-40 శాతం దాకా ఉన్నారు, శిక్షణ , శస్త్రచికిత్సల్లో సీనియర్‌ వైద్యులకు వీరు సహాయం చేస్తారు. వారి వాకౌట్‌ల కారణంగా ఆసుపత్రులలో చాలా వరకు శస్త్రచికిత్సలు , వైద్య సేవలు నిలిచిపోయాయి. యువ వైద్యులకు మద్దతుగా సీనియర్‌ వైద్యులు వరుస ర్యాలీలు నిర్వహించారు. సమ్మెలో ఇంకా చేరలేదు. వారు కూడా సమ్మెలో పాల్గొంటే దక్షిణ కొరియా వైద్య వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోతుంది. దేశంలో వద్ధాప్య జనాభా వేగంగా పెరుగతుతున్నందున ఆరోగ్య రంగంలో ఈ సవాల్‌ను ఎదుర్కొనేందుకు వచ్చే విద్యా సంవత్సరం నుండి 2,000 ఎంబిబిఎస్‌ సీట్లను అదనంగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత 3,058 నుండి. అభివద్ధి చెందిన దేశాలలో దక్షిణ కొరియా వైద్యుల-జనాభా నిష్పత్తి అత్యల్పంగా ఉందని అధికారులు చెబుతున్నారు.మెడికల్‌ కళాశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచకుండా మెడికల్‌ సీట్లను ఇష్టానుసారంగా పెంచేయడం వల్ల వైద్య విద్య నాణ్యత పడిపోతుందనేది జూనియర్‌ డాక్టర్ల వాదన.

➡️