అమెరికాలో భారతీయ విద్యార్థుల వరుస హత్యలు..!

Jan 30,2024 11:21 #America, #india student death

అమెరికా : అమెరికాలో భారతీయుల విద్యార్థుల వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. జార్జియాలోని లిథోనియా నగరంలో 25 ఏళ్ల భారతీయ విద్యార్థి వివేక్‌ సైనీ దారుణ హత్యకు గురైన విషయం మరవకముందే.. మరో విద్యార్థి నీల్‌ ఆచార్య మృతి చెందినట్లు మంగళవారం అధికారులు తెలిపారు. ఈ ఘటనపై అక్కడి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జాన్‌ మార్టిన్సన్‌ హానర్స్‌ కాలేజీలో కంప్యూటర్‌ సైన్స్‌, డేటా సైన్స్‌లో మాస్టర్స్‌చేస్తున్న ఆచార్య ఆదివారం నుంచి కనిపించకుండా పోయాడు. అయితే క్యాంపస్‌ నుంచి అదృశ్యమైన ఆచార్య మృతి చెందినట్లు పోలీసులు ధృవీకరించారు. క్యాంపస్‌లోని మారిస్‌ జే జుకక్రో లాబొరేటరీస్‌ సమీపంలో ఆచార్య మృతదేహం లభ్యమైనట్లు తెలిపారు. మృతదేహం వద్దనున్న ఐడీ ఆధారంగా అతన్ని గుర్తించినట్లు చెప్పారు. పర్డ్యూ యూనివర్సిటీ కంప్యూటర్‌ సైన్స్‌ విభాగం అధిపతి క్రిస్‌ క్లిఫ్టన్‌ కూడా నీల్‌ ఆచార్య మరణాన్ని ధృవీకరించారు. అయితే నీల్‌ ఆచార్యను ఎవరో హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

➡️