పెరూ ఎడారిలో 1.2 కోట్ల సంవత్సరాల నాటి మొసలి శిలాజం

లిమా : శిలాజ మొక్కలు, జంతువులపై పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలు పెరూ దీవిలో 1.2 కోట్ల సంవత్సరాల నాటి మొసలి శిలాజాన్ని బుధవారం గుర్తించారు. చేపలను తినే ఈ మొసలి దాదాపు మూడు మీటర్లు అంటే దాదాపు 10 అడుగుల పొడవుంది. పెరూ రాజధాని లిమాకు 350 కిలోమీటర్ల దూరంలో గల ఒకూకేజ్‌ ఎడారిలో ఇది బయటపడింది. ఇది పూర్తిగా ఎదగని మొసలి అని, ఎదగకుండానే..ముందే చనిపోయిందని, ఇటువంటి దాన్ని మొదటిసారిగా గుర్తించామని పరిశోధనకు నేతృత్వం వహించిన మారియో గామర్రా చెప్పారు. ఈనాటి మొసళ్ళకు పూర్తి భిన్నమైన రూపంలో దీని కపాలం, దవడలు వున్నాయన్నారు. దీనికి దాదాపుగా దగ్గరగా వచ్చే బంధువుగా ఇండియన్‌ ఘరియల్‌ను చెప్పుకోవచ్చునని ఆయన తెలిపారు. పెరూలోని ఈ ఏడారిలో శిలజాలు ఎక్కువుగా వుంటాయి. 5 నుండి 23 మిలియన్ల సంవత్సరాల నాటి కాలానికి చెందిన నాలుగు కాళ్ల పొట్టి వేల్స్‌, డాల్ఫిన్లు, షార్క్‌లు , ఇతర జంతువుల శిలాజాలు గతంలో ఇక్కడ లభ్యమయ్యాయి.

➡️