Thunderstorm: ఉగాండాలో పిడుగుపాటుకు 14 మంది మృతి 

Nov 4,2024 10:59 #Deaths, #Thunderstorm, #Uganda

కంపాలా : ఉగాండాలో పిడుగుపాటుకు 14 మంది మృతి చెందారు. 34 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఉత్తర ఉగాండాలోని లామ్వో జిల్లాలోని పాలబెక్ శరణార్థుల శిబిరంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. మృతి చెందిన శరణార్థులు ఎక్కడి నుంచి వచ్చారో  గుర్తించలేకపోయామని పోలీసులు తెలిపారు. అయితే ఎక్కువమంది శరణార్థులు దక్షిణ సూడాన్ నుండి వచ్చిన వారే శిబిరంలో నివసిస్తున్నారని తెలిపారు. ఈ శరణార్థులలో ఎక్కువ మంది 2011లో స్వాతంత్ర్యం పొందినప్పటి నుండి సూడాన్ అంతర్యుద్ధం నుండి పారిపోయారు. మృతి చెందిన వారిలో ఎక్కువ మంది మైనర్లే. తూర్పు ఆఫ్రికా దేశాల్లో ఇలాంటి ప్రాణాంతక పిడుగులు సర్వసాధారణం.

➡️