Papua New Guinea: మృతులు 2వేల పైనే!

  • ఐరాసకు పపువా న్యూగినియా అధికారుల నివేదిక

పోర్ట్‌ మోర్స్‌బై : పపువా న్యూగినియాలో భారీగా కొండచరియలు విరిగిపడిన ఘటనలో చనిపోయినవారు 2వేలకు పైనే ఉంటారని ఆ దేశ అధికారులు తెలిపారు. పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడడంతో మారుమూల గ్రామం మొత్తం నేలమట్టమై పోయిందని చెప్పారు. దేశ రాజధాని పోర్ట్‌ మోర్స్‌బైలోని ఐక్యరాజ్య సమితి ప్రాంతీయ కార్యాలయానికి ఈ మేరకు జాతీయ విపత్తుల నిర్వహణా కేంద్రం సమాచారం అందించింది. అంచనాలకు అందనంత విధ్వంసం చోటు చేసుకుందన్నారు. ఎంగా ప్రావిన్స్‌లో పర్వత సానువుల్లో గల మారుమూల కుగ్రామం దాదాపు కనుమరుగైందని అధికారులు తెలిపారు. ముంగలో పర్వతం నుండి పెద్ద కొండచరియ శుక్రవారం తెల్లవారు జామున విరిగిపడడంతో వందలాది ఇళ్లు శిధిలమయ్యాయి, తొలుత 670మందికి పైగా మరణించారని ఐక్యరాజ్య సమితి శరణార్ధ సంస్థ అంచనా వేసింది.

చిన్న దేశానికి అతి పెద్ద విపత్తు – 670 మందికి పైగా సజీవ సమాధి

➡️