గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయిల్‌ సైన్యం దాడులు : 23 మంది మృతి

Nov 30,2024 16:42 #Gaza, #Israel

గాజా : ఏడాదికి పైగా ఇజ్రాయిల్‌ సైన్యం గాజాపై దాడులు కొనసాగిస్తూనే ఉంది. తాజాగా శనివారం ఉదయం తెల్లవారుజాము నుండే గాజా స్ట్రిప్‌పై దాడులు చేయడం ప్రారంభించింది. ఈ దాడుల్లో కనీసం 23 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. గాజా సిటీలో 17 మంది, జబాలియాలో ఒకరు, ఖాన్‌ యూనిస్‌లో ముగ్గురు వరల్డ్‌ సెంట్రల్‌ కిచెన్‌ సహాయక సిబ్బందితో సహా ఐదుగురు మృతి చెందారని మీడియా వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో గాజాలోని పాలస్తీనియన్లు ఆకలి కేకలు తీవ్రస్థాయికి చేరుకున్నాయని ప్రభుత్వ మీడియా వర్గాలు తెలిపాయి.
కాగా, తూర్పు గాజా సిటీలో షుజయూ పరిసరాల్లోని ఒక ఇంటిపై ఇజ్రాయిల్‌ సైన్యం వైమానిక దాడి జరిపింది. ఈ దాడిలో ఒక చిన్నారి మృతి చెందింది. పలువురు గాయపడ్డారు అని మీడియా వర్గాలు పేర్కొన్నాయి.

➡️