పెరూలో బస్సు ప్రమాదం- 26 మంది మృతి

Jul 17,2024 23:15 #26 death, #bus acident, #South America

లిమా: దక్షిణ అమెరికా దేశం పెరూ బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 26 మంది చనిపోయారు. మరో 14 మంది గాయపడ్డారు. రాజధాని లిమా నుంచి 40 మందికి పైగా ప్రయాణికులతో బస్సు ఆండియన్‌ ప్రాంతానికి బయలుదేరింది. ఈ క్రమంలో బస్సు 200 మీటర్ల లోతులో ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. సమాచారం అందిన వెంటనే స్థానిక అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. తొలుత గాయపడ్డ ఇద్దరు బస్సు డ్రైవర్లను సమీప ఆసుపత్రికి తరలించారు. పర్వత రోడ్లు, వేగంగా వెళ్లడం, రోడ్లు దయనీయంగా ఉండడం, ట్రాఫిక్‌ సంకేతాలు లేకపోవడం తదితర కారణాల వల్ల పెరూలో తరుచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆ దేశంలో 3,100 మంది చనిపోయారు.

➡️