Gaza: మృత్యువు అంచున 50వేల మంది పిల్లలు

గాజా : ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఈద్ అల్-ఫితర్ జరుపుకోవడానికి సిద్ధమవుతున్న తరుణంలో గాజాలో 50,000 మంది పిల్లలు తగినంత ఆహారం, పోషకాహారం లేకపోవడంతో మరణాల అంచున ఉన్నారు. ఇజ్రాయెల్ దిగ్బంధనం కారణంగా ఆహారం, ఔషధాల కొరతే సంక్షోభానికి కారణమవుతుందని ఐక్యరాజ్యసమితి శరణార్థి సంస్థ తెలిపింది. పౌష్టికాహారం అత్యవసరంగా పంపిణీ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని శరణార్థి సంస్థ  ఎక్స్ లో పోస్టు చేసింది.

గాజాలోని పిల్లలకు సరైన సహాయం అందడం లేదని యునిసెఫ్ కూడా స్పందించింది. సహాయాన్ని అందించడానికి యుఎన్ ప్రయత్నాలు సైనిక తనిఖీ కేంద్రాల వద్ద నిరోధించబడ్డాయి. ఐక్యరాజ్యసమితి ఏర్పాటైనప్పటి నుంచి ప్రస్తుత యుద్ధంలో అత్యధిక మంది స్వచ్ఛంద సేవకులు మరణించారని యునిసెఫ్ ప్రతినిధి జేమ్స్ ఎల్డర్ అన్నారు. గడిచిన 24 గంటల్లో ఇజ్రాయెల్ దళాలు వివిధ ఇళ్లపై జరిపిన బాంబు దాడిలో 30 మంది మరణించారు.

➡️