జపాన్ : సైక్లింగ్ చేస్తూ స్మార్ట్‌ఫోన్‌తో కాల్ చేయడం లేదా స్క్రీన్‌ను చూస్తే గరిష్టంగా ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ.55,000 వరకు జరిమానా. ఇది ఎక్కడో కాదు ఆర్ధికంగా అభివృద్ధి చెందిన టాప్ 5 దేశాలలో ఒకటైన జపాన్ లో. సైక్లిస్టులు మొబైల్ స్క్రీన్‌లను చూడటం వల్ల జరిగిన కొన్ని ప్రమాదాలు పాదచారుల మరణాలకు దారితీశాయని ప్రభుత్వం పేర్కొంది. దీంతో నవంబర్ 1 నుండి కఠినమైన కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. కొత్త నిబంధనల ప్రకారం, మద్యం తాగి సైక్లింగ్ చేస్తే రైడర్‌కు గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష & రూ. 2.75 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. జపాన్‌లో మొత్తం ట్రాఫిక్ ప్రమాదాల సంఖ్య తగ్గుతున్నప్పటికీ, సైకిళ్లతో సంబంధం ఉన్న ప్రమాదాల నిష్పత్తి పెరుగుతోంది.
