నోయిడాలోని రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం

నోయిడా : నోయిడాలోని ఓ రెస్టారెంట్‌లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సెక్టర్‌ 18 లో గ్రావిటీ మంత్ర రెస్టారెంట్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగింది, ఎవరికైనా గాయాలయ్యాయా, ఎంత మేరకు నష్టం వాటిల్లింది.. తదితర వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఫైరింజన్లు మంటలను అదుపు చేస్తున్నాయి. అధికారులు విచారణ చేపట్టారు.

➡️