- పశ్చిమ దేశాలకు ఇది ఓ హెచ్చరిక అన్న పుతిన్
మాస్కో: ఉక్రెయిన్ ముసుగులో అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు, నాటో కలసి మాస్కోపై దురాక్రమణ కు యత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రష్యా హెచ్చరించింది. తనపై దాడికి అణు శక్తి దేశాలు మద్దతు ఇస్తే ఏం జరుగుతుందో ఒక హెచ్చరికగా సవరించిన ఈ అణు విధానం ఉంటుందని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెష్కొవ్ అన్నారు. అణు దేశాలు ఏదైనా అణుయేతర దేశం ద్వారా రష్యాపై దాడికి యత్నిస్తే దానిని దురాక్రమణగా పరిగణించి, అణు ఆప్షన్‌ను ఆశ్రయించే విషయం పరిశీలిస్తామని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ హెచ్చరించారు. రష్యన్ అణు సిద్ధాంతాన్ని తాజా పరచడం ద్వారా పుతిన్ పశ్చిమ దేశాల దూకుడుకు గట్టి చెక్ పెట్టారని పరిశీలకులు భావిస్తున్నారు.