America లోని రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి

అమెరికా : అమెరికాలోని పోర్టుల్యాండ్‌ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొణకంచికి చెందిన మహిళ కమతం గీతాంజలి (32) మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత ఆదివారం గీతాంజలి కుటుంబ సభ్యులు కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగి, గీతాంజలి కుమార్తె హానిక అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన గీతాంజలిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండగా సోమవారం ఆమె మృతి చెందారు. ఈ దుర్ఘటనలో గీతాంజలి భర్త నరేష్‌, కుమారుడు బ్రమణ్‌కు గాయాలవ్వగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో తల్లీ, కుమార్తెల మృతితో వారి బంధువుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. వారి మృతదేహాలను స్వగ్రామం కొణకంచికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బంధువులు తెలిపారు.

➡️