America – అమెరికాలో మరో విమానానికి తృటిలో తప్పిన పెను ప్రమాదం

Feb 3,2025 08:46 #America, #Another flight, #near miss

హ్యూస్టన్‌ (అమెరికా) : అమెరికాలో మరో విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. భారత స్థానిక కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున … అమెరికాలో హ్యూస్టన్‌ నుంచి న్యూయార్క్‌ వెళ్లే యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం జార్జిబుష్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో టేకాఫ్‌ అవుతుండగా, దాని రెక్కలలో ఒకదాని నుంచి మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన విమానాశ్రయ సిబ్బంది విమానంలో నుంచి ప్రయాణీకులను దింపేశారు. ఈ క్రమంలో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని హ్యూస్టన్‌ ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. గడిచిన మూడు రోజుల్లోనే రెండు విమాన ప్రమాదాల సంభవించగా.. తాజాగా మరో విమానానికి ప్రమాదం తప్పింది.

➡️