నిజ్జర్‌ హత్య కేసులో మరో భారతీయుడు అరెస్ట్‌

May 12,2024 08:53 #Canada, #Nijjar murder case

న్యూఢిల్లీ :    ఖలిస్తాన్‌ వేర్పాటు వాది నేత హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసులో మరో భారతీయుడిని అరెస్ట్‌ చేసినట్లు కెనడా పోలీసులు తెలిపారు. కెనడాలోని బ్రాంప్టన్‌, సర్రే, అబాట్స్‌ఫోర్డ్‌ ప్రాంతాలలో నివసిస్తున్న అమర్‌దీప్‌ సింగ్‌ (22)పై ఫస్ట్‌ డిగ్రీ హత్య, హత్యకు కుట్ర అభియోగాలు మోపారు. నిజ్జర్‌ హత్యలో పాత్ర ఉన్నందుకు సింగ్‌ను శనివారం అరెస్ట్‌ చేసినట్లు ఇంటిగ్రేటెడ్‌ హోమిసైడ్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ (ఐహెచ్‌ఐటి) తెలిపింది. ఆయుధాల కేసులో ఇప్పటికే అతను పీల్‌ ప్రాంతీయ పోలీసుల అదుపులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు భారతీయులను కెనడా పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

➡️