కాలిఫోర్నియా వర్శిటీలో మళ్లీ భగ్గుమన్న నిరసనలు

విద్యార్థుల శిబిరంపై పోలీసుల దాడి
లాస్‌ఏంజెల్స్‌ : గాజాకు సంఘీభావంగా కాలిఫోర్నియా యూనివర్శిటీలో ఆందోళన మళ్లీ ఊపందుకుంది. .కేంపస్‌లో మూడోసారి శిబిరాన్ని ఏర్పాటు చేసి శాంతియుతంగా నిరసన తెలుపుతున్నవారిపై పోలీసులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. విద్యార్థులు ప్రతిఘటించడంతో కేంపస్‌లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. లాస్‌ఏంజెల్స్‌లోని యూనివర్శిటీలోని ఈ యూనివర్సిటీలో ఆందోళనకారులు శిబిరాలు వేసి, బారికేడ్లు ఏర్పాటు చేశారని విద్యార్ధుల పత్రిక డైలీ బ్రూయిన్‌ పేర్కొంది. ఇజ్రాయిల్‌ దాడుల్లో మరణించిన పాలస్తీనియన్లకు ప్రతీకగా రక్తమోడుతున్న శరీరపు భాగాల బమ్మలను పట్టుకుని ఆందోళనకారులు ప్రదర్శన నిర్వహించారు. ”మన అమరులను గౌరవిద్దాం” అని వారు నినదించారు. ఇప్పటివరకు 46వేల మందికి పైగా పాలస్తీనియన్లు ఈ మారణహౌమంలో మరణించారని ఈ నిరసన ప్రదర్శన నిర్వాహక సంస్థ స్టూడెంట్స్‌ ఫర్‌ జస్టిస్‌ ఇన్‌ పాలస్తీనా తెలిపింది. ఈ నిరసనలకు చేతులు కలపాల్సిందిగా ప్రజలను కోరింది..

➡️