- ప్రకటించిన న్యూయార్క్ సిటీ
న్యూయార్క్ : ఇక నుంచి ప్రతి ఏటా ఏప్రిల్ 14ను ‘డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దినోత్సవం’గా న్యూయార్క్ సిటీ జరుపుకోనుంది. ఈ మేరకు నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ నిర్ణయం తీసుకున్నారు. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ విషయాన్ని మేయర్ కార్యాయంలో ఉన్నతాధికారి దిలీప్ చౌహాన్ ప్రకటించారు. అంబేద్కర్ ఆదర్శాలు సరిహద్దులు, కాలానికి అతీతంగా ఉంటా యని ఈ సందర్భంగా చౌహాన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి రాందాస్ అధవాలే కూడా పాల్గొన్నారు.