భద్రతా మండలి తీర్మానంపై అరబ్బు దేశాల హర్షం

న్యూయార్క్‌: రంజాన్‌ సందర్భంగా ‘తక్షణ కాల్పుల విరమణ’ డిమాండ్‌ చేస్తూ భద్రతా మండలి మొదటిసారి తీర్మానాన్ని ఆమోదించడం పట్ల అరబ్బు దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. శాశ్విత కాల్పుల విరమణ దిశగా వేసిన మొదటి అడుగుగా యెమెన్‌ దీనిని అభివర్ణించింది. అరబ్‌ గ్రూప్‌ తరపున యెమెన్‌ ప్రతినిధి అబ్దుల్లా అలీ ఫదేల్‌ అల్‌-సాదీ మాట్లాడుతూ , తీర్మానానికి మద్దతు ఇస్తున్న 14 దేశాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శాశ్వత కాల్పుల విరమణపై కట్టుబడి తీర్మానానికి దారితీసే తొలి అడుగుగా ఈ తీర్మానాన్ని పరిగణించాలని ఆయన అన్నారు. ఇజ్రాయెల్‌ దురాక్రమణదారులు తమ మారణహౌమ యుద్ధాన్ని కొనసాగిస్తూ, స్త్రీలు మరియు పిల్లలను లక్ష్యంగా చేసుకుని దాడులు సాగిస్తున్నాయి. ఆహార ప్యాకెట్ల కోసం ట్రక్కుల వద్ద బారులు తీరిన వారిని కూడా కాల్చి చంపిన ఇజ్రాయిల్‌ అమానుష చర్యను ఆయన ఖండించారు. జెరూసలేం సహా పాలస్తీనియన్లపై హింసను ప్రేరేపిస్తున్న ఇజ్రాయెల్‌ సెటిలర్లపై కఠిన ఆంక్షలు విధించాలని కౌన్సిల్‌కు పిలుపునిచ్చారు. ఈ యుద్ద నేరాలకు ఇజ్రాయెల్‌ను జవాబుదారీ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.
గాజాలో గత 24గంటల్లో 50మంది పాలస్తీనియన్లు మృతి
గాజా పై ఇజ్రాయిల్‌ తాజాగా జరిపిన దాడిలో 50మందికి పైఃగా పాలస్తీనియన్లు మరణించారు. సెంట్రల్‌ గాజాలోని డేర్‌ అల్‌ బాలాV్‌ా ప్రాంతంలో ఇజ్రాయిల్‌ జరిపిన వైమానిక దాడిలో 22మంది చనిపోగా, రఫా నగరంలో మరో 30మంది మరణించారు. ఇప్పటికే దాడుల్లో చాలా భాగం ధ్వంసమైన అల్‌ షిఫా ఆస్పత్రిని ఇజ్రాయిల్‌ బలగాలు దిగ్బంధించగా అక్కడ నుండి పారిపోయిన పాలస్తీనియన్లు ఆ దారుణ పరిస్థితులను గుర్తు చేసుకుని భయ కంపితులవుతున్నారు. ఇజ్రాయిల్‌ ట్యాంకులు, సాయుధ బుల్డోజర్లు నాలుగు మృత దేహాలను తొక్కుకుంటూ అంబులెన్సులు వెళ్లాయని వారు చెప్పారు. రఫా నగరంలో ప్రతి క్షణమూ బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోందని అక్కడి ప్రజలు వాపోయారు. దక్షిణ గాజాలోని అల్‌ అమల్‌, నాసర్‌ ఆస్పత్రులపైనా ఇజ్రాయిల్‌ బలగాలు దాడి చేశాయి. ఉత్తర గాజాలోకి ఐక్యరాజ్య సమితి ఆహార బృందాలను అనుమతించేది లేదని ఇజ్రాయిల్‌ హూంకరించింది. ఉత్తర గాజాలో ఇప్పటికే 70శాతానికిపైగా ప్రజలు తీవ్రమైన ఆహార కొరతతో ఇబ్బంది పడుతున్నట్లు ఐరాస చీఫ్‌ ఆంటోనియా గుటెరస్‌ పేర్కొన్నారు. గతేడాది అక్టోబరు నుండి ఇజ్రాయిల్‌ విచక్షణారహితంగా జరుపుతున్న యుద్ధంలో ఇప్పటివరకు 32,333మంది మరణించగా, 74,694మంది గాయపడ్డారు.

➡️