కాన్‌బెర్రా: 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించే బిల్లును ఆస్ట్రేలియా సెనేట్ 34-19 ఓట్ల తేడాతో గురువారం ఆమోదించింది. త్వరలోనే ఇది చట్ట రూపం దాల్చనుంది. పిల్లలకు సోషల్ మీడియాను దూరం చేసే ఈ రకమైన చట్టాన్ని తెచ్చిన తొలి దేశం ఆస్ట్రేలియానే. 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియాలో ఖాతాలను కలిగి ఉండడాన్ని ఈ చట్టం నిరోధిస్తుంది. ఎవరైనా ఈ చట్టాన్ని ఉల్లంఘించినట్లైతే భారీ జరిమానా విధిస్తారు.