Bangladesh : తాత్కాలిక ప్రభుత్వ చీఫ్‌ యూనస్‌ అక్రమాస్తుల కేసులో నిర్దోషిగా విడుదల

ఢాకా :    అక్రమాస్తుల కేసులో బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్‌ ప్రొఫెసర్‌ మహ్మద్‌ యూనస్‌ను ఆదివారం నిర్దోషిగా ప్రకటించినట్లు స్థానిక మీడియా తెలిపింది. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ కింద కేసును ఉపసంహరించుకోవాలని కోరుతూ గ్రాప్ట్‌ ఏజన్సీ దరఖాస్తును స్వీకరించిన తర్వాత ఢాకాలోని ప్రత్యేక న్యాయమూర్తి కోర్టు -4 జడ్జి ఎండి. రబీయుల్‌ ఆలం ఈ ఉత్తర్వులు జారీ చేశారు.  కార్మికచట్టాల ఉల్లంఘన కేసులో యూనస్‌ సహా మరో ముగ్గురు గ్రామీణ టెలికం సంస్థ అధికారులు అష్రఫల్‌ హసన్‌, షాజహాన్‌, నూర్జహాన్‌ బేగంలను ఆగస్టు 7న లేబర్‌ అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ నిర్దోషులుగా ప్రకటించించి.

గ్రామీణ టెలికం కార్మికులు మరియు ఉద్యోగుల సంక్షేమ నిధుల నుండి నగదు దుర్వినియోగంపై కార్మిక చట్టాన్ని ఉల్లంఘించారంటూ అవినీతి నిరోధక కమిషన్‌ ఈ కేసును నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో వారికి ఆరు నెలల జైలు శిక్ష, ఒక్కొక్కరికి 30,000 టాకాలు జరిమానా విధించింది.

➡️