షేక్‌ హసీనా అరెస్టుకు ఇంటర్‌పోల్‌ సాయం కోరిన బంగ్లాదేశ్‌

ఢాకా : దేశం విడిచి పారిపోయిన మాజీ ప్రధాని షేక్‌ హసీనాను అరెస్టు చేయడానికి సహాయం చేయాలని అంతర్జాతీయ పోలీసు సంస్థ ఇంటర్‌పోల్‌ను బంగ్లాదేశ్‌ కోరింది. హసీనాకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో వందలాది మంది నిరసనకారుల మరణానికి సంబంధించి ఆమెపై రెడ్‌ నోటీసు జారీ చేయాలని ఇంటర్‌పోల్‌ను బంగ్లాదేశ్‌ ప్రత్యేక ట్రిబ్యునల్‌ కోరింది. ఈ విషయాన్ని ట్రిబ్యునల్‌ ప్రాసిక్యూటర్‌ మీడియాకు వెల్లడించారు. ఈ మేరకు ఇంటర్‌పోల్‌కు పోలీసు చీఫ్‌ లేఖ రాశారని చెప్పారు. హసీనా నేరాలపై విచారణ చేస్తామని మహమ్మద్‌ యూనస్‌ ప్రభుత్వం పేర్కొన్న సంగతి విదితమే.

➡️