అమెరికా : అమెరికా లో తొలి బర్డ్ ఫ్లూ మరణం కలకలం రేపింది. లూసియానాలో ఓ వ్యక్తి బర్డ్‌ఫ్లూ సోకి మరణించినట్లు అక్కడి వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో పాటు పలు సమస్యలతో 65 ఏళ్ల వ్యక్తి ఆస్పత్రిలో చేరినట్లు అక్కడి వైద్యులు పేర్కొన్నారు. అడవి పక్షులు, పెరటి మందకు దగ్గరగా వెళ్లడం వల్ల ఆ వ్యక్తికి హెచ్5ఎన్1 సోకిందని తెలిపారు. అయితే, ఆ వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ఈ వైరస్ వ్యాపించినట్లు ఎలాంటి ఆధారాలు కనిపించలేదని అధికారులు వెల్లడించారు.