బ్రిక్స్ కూటమిలో చేరతాం : బొలీవియా

Jun 9,2024 08:56 #Bolivia, #BRICS

సెయింట్ పీటర్స్‌బర్గ్  : బొలీవియా అధ్యక్షుడు లూయిస్ ఆర్స్ బ్రిక్స్ కూటమిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో శనివారం జరిగిన అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో ఆయన ఈ ప్రకటన చేశారు. భారతదేశం, బ్రెజిల్, రష్యా, చైనా మరియు దక్షిణాఫ్రికా నేతృత్వంలో ఏర్పడిన బ్రిక్స్ కూటమిలో చేరడం వలన బొలీవియా ఆర్థిక-పారిశ్రామిక అభివృద్ధిని బలోపేతం అవుతుందని ఆయన  ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా అమెరికా నియంతృత్వాన్ని ప్రశ్నించే అవకాశం పెరుగుతుందని ఆయన అన్నారు. బొలీవియాలో లిథియం పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా ఆ దేశంపై ఒత్తిడి తెస్తున్న నేపధ్యంలో బొలీవియా బ్రిక్స్ సభ్యత్వానికి ఆసక్తి చూపుతోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా బ్రిక్స్‌లో కొత్త దేశాలను చేర్చుకునేందుకు  అనుకూలంగా ఉన్నారు.

➡️