చార్జింగ్‌ స్టేషన్‌ లో కేబుల్స్‌ చోరి..

May 15,2024 16:45 #Cables stolen, #charging station

క్యాలిఫోర్నియా: రాగి దొంగలు అమెరికాకు తలనొప్పిగా మారారు. ఎలక్ట్రానిక్‌ వాహనాల ఛార్జింగ్‌ స్టేషన్ల మరమ్మతుకే వేల డాలర్లను అమెరికా ఖర్చు చేయాల్సి వస్తోంది. తాజాగా క్యాలీఫోర్నియాలో టెస్లాకు చెందిన 9 ఎలక్ట్రానిక్‌ వాహనాల ఛార్జింగ్‌ స్టేషన్లలో దొంగలు కేబుల్‌ను దొంగిలించారు. కేబుల్‌ దొంగతనానికి గురైన విషయాన్ని వాహనధారులు గుర్తించి టెస్లాకు ఫిర్యాదు చేశారు. కాగా టెస్లా సాంకేతిక నిపుణులు 9 ఎలక్ట్రానిక్‌ వాహనాల ఛార్జింగ్‌ స్టేషన్లలో మరమ్మతులు చేసి ఒక్క రోజులోనే మళ్ళీ ప్రజలకు అంధుబాటులోకి తీసుకువచ్చారు.

➡️