కొలంబో : వడ్డీరేట్లను మార్చకుండా ఎస్‌డిఎఫ్‌ఆర్ (స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్) రేటును 8.25 శాతంగా, ఎస్‌ఎల్‌ఎఫ్‌ఆర్ (స్టాండింగ్ లెండింగ్ ఫెసిలిటీ రేట్) రేటును 9.25 శాతంగా కొనసాగించాలని శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ నిర్ణయించింది. సూక్ష్మ ఆర్థిక పరిస్థితులను సమగ్రంగా విశ్లేషించడం, దానితోపాటు దేశీయ, విదేశీ ముప్పులను, అనిశ్చితులను అంచనా వేసిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. సమీప భవిష్యత్తులో ద్రవ్యోల్బణాన్ని 5శాతం వద్దనే పరిమితం చేయాలన్నది ప్రాధమిక లక్ష్యంగా వుంది. మరోపక్క ఆర్థిక వ్యవస్థను పూర్తి సామర్ధ్యంతో పనిచేసేలా చూడాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నట్లు బ్యాంక్ తెలిపింది.