China: లేబర్‌ మార్కెట్‌ స్థిరీకరణకు చైనా చర్యలు

Feb 14,2025 21:20 #China, #Employment

కోటిన్నర మందికి ఉపాధి కల్పన
దేశవ్యాప్తంగా జాబ్‌మేళాలు
బీజింగ్‌ : లేబర్‌ మార్కెట్‌ను సుస్థిరీకరించడానికి, సజావుగా వాణిజ్య కార్యకలాపాలు సాగేందుకు వీలుగా చైనా తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ల్లో ఉద్యోగ మేళాలు నిర్వహిస్తోంది. వలస కార్మికులు తిరిగి తమ విధులకు హాజరయ్యేందుకు సాయపడేలా బస్సులు, రైళ్ళు, విమానాలు నడుపుతామని హామీలిచ్చింది. జనవరి మధ్య నుండి ఫిబ్రవరి 11 వరకు దేశవ్యాప్తంగా మొత్తంగా 22 వేల రిక్రూట్‌మెంట్‌ కార్యక్రమాలు నిర్వహించారు. 1.5 కోట్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పించినట్లు చైనా మానవ వనరుల మంత్రిత్వ శాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. వసంతోత్సవాల అనంతరం దాదాపు 3,70,000 మంది వలస కార్మికులు తమ ఉద్యోగాలకు తిరిగి హాజరు కాగా, వీరి కోసం 15 వేలకు పైగా బస్సులు, రైళ్ళు, విమానాలను ఏర్పాటు చేసింది. వ్యాపార వాణిజ్య వర్గాలకు చెందిన విధుల్లో పాల్గనే కార్మికుల అవసరాలను పరిష్కరించడంపై ప్రధానంగా దృష్టి పెట్టినట్లు మానవ వనరుల శాఖ తెలిపింది.

➡️