ముగిసిన క్యూబా కమ్యూనిస్టు పార్టీ ప్లీనరీ

Jul 7,2024 23:33 #Communist Party, #Cuba, #Plenary
  • దేశం ఎదుర్కొంటున్న సవాళ్లపై దృష్టి

హవానా: క్యూబా కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ 8వ ప్లీనరీ సమావేశం శుక్ర, శనివారాల్లో రెండు రోజులపాటు హవానాలో జరిగింది. క్యూబా రపిబ్లిక్‌ అధ్యక్షుడు, పార్టీ మొదటి కార్యదర్శి మిగుయెల్‌ డియాజ్‌ కానెల్‌ బెర్ముడెజ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ, ప్రభుత్వ పనితీరును సమీహించారు. 2021 ఏప్రిల్‌లో జరిగిన పార్టీ 8వ మహాసభ తరువాత నిర్వహించిన ఎనిమిదో ప్లీనరీ ఇది. వక్రీకరణలు సరిదిద్దడం, ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి ప్రభుత్వ అంచనాల అమలు తీరుతెన్నులు, అలాగే ఆహార ఉత్పత్తిలో సాధించిన పురోగతి, ఆహార సార్వభౌమాధికారం, పోషకాహారం, విద్య, చట్టాల అమలు వంటి పలు అంశాలపై చర్చ జరిగినట్లు అధ్యక్షుడు కానెల్‌ తెలిపారు.

➡️