ఒట్టావా : సోమవారం జరిగిన కెనడా ఎన్నికల్లో లిబరల్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ దేశ చరిత్రలో వరుసగా నాలుగోసారి అధికారంలోకి వచ్చిన పార్టీగా లిబరల్ పార్టీ చరిత్ర సృష్టించింది. ఈ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ కంటే.. లిబరల్ పార్టీనే అత్యధిక స్థానాల్లో గెలుపొందింది. అయితే పార్లమెంటు 343 సీట్లలో లిబరల్ పార్టీ : 167, కన్జర్వేటివ్ పార్టీ : 145 స్థానాల్లో గెలుపొందాయి. ఇక బ్లాక్ క్యూబెకోయిస్ : 23 సీట్లు, ఎన్ డిపి 7 సీట్లు, గ్రీన్ పార్టీ : 1 సీటులో గెలిచాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో కెనడా ప్రజలు లిబరల్ పార్టీకే పట్టం కట్టడంతో.. ప్రధానిగా మార్క్ కార్నీనే మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటికే సోషల్‌మీడియాలో కార్నీకి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
కెనడా సార్వత్రిక ఎన్నికల ఫలితాలు – విజయం దిశగా లిబరల్ పార్టీ