ఫ్లోరిడా : మూడోసారి రోదసిలోకి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్‌లను భూమిపైకి తిరిగి తీసుకొచ్చేందుకు నాసా-స్పేస్‌ఎక్స్‌లు ప్రయోగించిన క్రూ 10 మిషన్ వాయిదా పడింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో అమెరికాలోని ఫ్లోరిడా నుంచి నలుగురు వ్యోమగాములతో ఫాల్కన్ 9 రాకెట్ బయలుదేరేందుకు క్రూ 10 మిషన్ ప్రయోగం నిలిచిపోయింది.హైడ్రాలిక్ సిస్టమ్‌లో సమస్య ఉత్పన్నం కావడంతో దీన్ని ఆపేసినట్లు నాసా పేర్కొంది. సమస్యను పరిష్కరించి ఈ వారంలో మరో ప్రయోగం చేయనున్నట్లు తెలిపింది. దీంతో వ్యోమగాముల రాక మరికొన్ని రోజులు ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. కాగా సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్‌లు దాదాపు తొమ్మిది నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.
