-పాత్రికేయ బృందంతో ఆ దేశ రాయబారి
న్యూఢిల్లీ : క్యూబా ప్రజల జీవితాలను పరిశీలించి, వారికి సంఘీభావం తెలపాలని భారతదేశంలోని ఆ దేశ రాయబారి జూన్ కార్లోస్ తనను కలిసిన పాత్రికేయ బృందాన్ని కోరారు. క్యూబన్ ప్రెస్ డే సందర్భంగా ఆ దేశానికి చెందిన యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఆఫ్ క్యూబా (యుపిఇసి)’పాట్రియా ఇంటర్నేషనల్ కొలోక్యూమ్’ పేరిట అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తోంది. ఈ నెల 17వ తేది నుండి 19 వ తేది వరకు హవానాలో జరిగే ఈ సదస్సులో పాల్గోనడానికి వెడుతున్న భారతీయ పాత్రికేయ బృందం న్యూఢిల్లీలో గురువారం జూన్ కార్లోస్ ని మర్యాద పూర్వకంగా కలిసింది. ఈ భేటీలో పలు అంతర్జాతీయ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా ఆంక్షల కారణంగా క్యూబన్ ప్రజలు పడుతున్న ఇబ్బందులను, వాటిని అధిగమించి సాగుతున్న ప్రజా ప్రస్థానాన్ని వివరించారు. ఆ ప్రజల జీవితాలను పరిశీలించి, సంఘీభావం తెలపాలని పాత్రికేయ బృందాన్ని కోరారు. ఈ బృందంలో ఆర్ అరుణ్‌కుమార్ (సిపిఎం అంతర్జాతీయ విభాగం) బి. తులసీదాస్ (ఎడిటర్, ప్రజాశక్తి)ఎం.కన్నన్ (తిక్కధీర్, డిజిటల్ ఎడిటర్)కె. శ్రీనివాసరెడ్డి (ప్రెస్ అకడామీ ఛైర్మన్- తెలంగాణ), బాలచంద్ర కాంగో(న్యూఎజ్) రామకృష్ణ పాండ (సిపిఐ) ఉన్నారు.
