పాకిస్థాన్ : పాకిస్థాన్‌లోని సింథ్ ప్రావిన్స్‌లో రోడ్లు నెత్తురోడాయి. రెండు వేర్వేరు చోట్ల ప్రమాదాలు జరిగి 16మంది మృతి చెందారు. మరో 45 మందికి గాయాలైనట్లు పోలీసులు వెల్లడించారు. సింధ్ ప్రావిన్స్‌లోని ఖైర్పూర్ సమీపంలోని రాణిపుర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 11మంది మృతి చెందగా.. 35 మందికి గాయాలయ్యాయి. బురేవాలా నుంచి వస్తున్న బస్సు జాతీయ రహదారిపై రిక్షాను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. షహీద్ బెనజీరాబాద్ జిల్లాలోని ఖాజీ అహ్మద్ పట్టణం సమీపంలో మరో ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళుతున్న వ్యాన్.. ముందుగా గాడిద బండిని ఢీకొట్టి ఆ తర్వాత ఎదురుగా వస్తున్న ట్రయిలర్‌ను ఢకొీట్టడంతో ఐదుగురు మృతి చెందగా.. 10మంది గాయపడ్డారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. గాయపడినవారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
