ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌లో శనివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.8గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సిఎస్) వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. శనివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో పాకిస్తాన్‌లో భూప్రకంపనలు సంభవించాయి. పొడవు : 72.43, వెడల్పు : 33.70, పది కిలోమీటర్ల లోతులో భూప్రకంపనలు సంభవించినట్లు ఎన్‌సిఎస్ ఎక్స్ పోస్టులో వెల్లడించింది. భూప్రకంపనలకు ఇళ్లు కూలిపోయాయి. ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.
