Earthquake : మయన్మార్‌లో మళ్లీ భూకంపం

Apr 14,2025 22:32 #earth quake, #Myanmar
  • 4.5 తీవ్రతతో భూప్రకంపనలు

నేపిటావ్‌ : మయన్మార్‌లో మార్చి 28వ తేదీన వరుస భూప్రకంపనలు సంభవించి వేలాది మంది మరణించిన . ఈ ఘటనను పూర్తిగా మరువకముందే మరోసారి మయన్మార్‌లో భూకంపం సంభవించింది. సోమవారం 4.5 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించాయని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ (ఎన్‌సిఎస్‌) వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. మయన్మార్‌లో సోమవారం తెల్లవారుజామున ఒకటిన్నర గంటల సమయంలో భూకంపం సంభవించింది. వెడల్పు : 19.78, పొడవు : 95.49, పది కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని ఎన్‌సిఎస్‌ ఎక్స్‌ పోస్టులో పేర్కొంది.

➡️