ఆఫ్ఘనిస్తాన్: ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందూకుష్ ప్రాంతంలో బుధవారం 5.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని యూరోపియన్-మెడిటరేనియన్ భూకంప కేంద్రం(ఈఎంఎస్సీ) తెలిపింది. దాదాపు 1,08,000 జనాభా కలిగిన బాగ్లాన్ నగరానికి తూర్పున 164 కి.మీ దూరంలో, 121 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉందని ఈఎంఎస్సీ తెలిపింది. మొదట 6.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు ఈఎంఎస్సీ నివేదించింది.
మరోవైపు దక్షిణ ఫిలిప్పీన్స్‌లో కూడా 5.6 తీవ్రతతో మరో భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యుఎస్జీఎస్) తెలిపింది. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఇప్పటివరకు సమాచారం లేదని పేర్కొంది. మిండానావో ద్వీపం తీరంలో భూకంపం 30 కిలోమీటర్ల లోతులో ఉందని యుఎస్జీఎస్ తెలిపింది. ఫిలిప్పీన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్నిపర్వత శాస్త్రం, భూకంప శాస్త్రం మైతుమ్ పట్టణానికి నైరుతి దిశలో 43 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించింది. భూకంపం వల్ల గణనీయమైన నష్టం జరగలేదని స్థానిక అధికారులు ఎఎఫ్పీకి తెలిపారు.
భారత్ లోని ఢిల్లీలో కూడా భూప్రకంపనలు సంభవించాయని తెలుస్తోంది.