Earthquake: న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్‌లో భూకంపాలు

Nov 28,2024 09:01 #Earthquake, #Newzland

వెల్లింగ్టన్ : న్యూజిలాండ్‌లో భూకంపం సంభవించింది. న్యూజిలాండ్‌లోని నార్త్ ఐలాండ్ తూర్పు తీరంలో గురువారం 5.7 తీవ్రతతో భూకంపం సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (జిఎఫ్‌జెడ్) తెలిపింది. భూకంపం 10 కిలోమీటర్ల (6.21 మైళ్లు) లోతులో ఏర్పడిందని జిఎఫ్‌జెడ్ తెలిపింది.

ఫిలిప్పీన్స్‌లోని లుజోన్‌లో కూడా గురువారం 5.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని జిఎఫ్‌జెడ్ తెలిపింది. భూకంపం 192 కిలోమీటర్ల (119.3 మైళ్లు) లోతులో ఏర్పడింది.

➡️