టోక్యో: జపాన్‌లో 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9:19 గంటలకు దేశ నైరుతి ప్రాంతంలో ప్రకంపనలు నమోదైనట్లు దేశ వాతావరణ విభాగం తెలిపింది. క్యుషు ద్వీపంలోని మియాజాకి ప్రిఫెక్చర్ సమీపంలో కేంద్రీకృతమై ఉంది, సమీపంలోని కొచ్చి ప్రిఫెక్చర్‌కు సునామీ హెచ్చరికలు కూడా జారీ చేయబడ్డాయి. ఒక మీటర్ వరకు అలలు ఎగసిపడే అవకాశం ఉందని వాతావరణ సంస్థ హెచ్చరించింది. గతేడాది ఆగస్టులోనూ జపాన్‌లో రెండు భారీ భూకంపాలు సంభవించాయి.
