గాజా : గాజావ్యాప్తంగా దాడులు కొనసాగుతున్నాయి. ప్రమాదకరమైన జోన్‌గా మారుతుందని హెచ్చరించి మరీ ప్రజలను ఇజ్రాయిల్ సైన్యం తరిమికొడుతుండడంతో ఇప్పటికి నిర్వాసితులైన వారి సంఖ్య 19 లక్షలకు చేరుకుందని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. మరోవైపు పదే పదే దాడుల నేపథ్యంలో ఖాన్ యూనిస్ నగరం శిధిలాల దిబ్బగా మారింది. ఈ నగరానికి సమీపంలోని అల్ ఖరారా, బని సుహాలియా, ఇతర ప్రాంతాల నుండి ప్రజలందరూ ఖాళీ చేయాలని మిలటరీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో దాదాపు రెండున్నర లక్షల మంది ప్రజలు ప్రభావితులయ్యారని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది.
