టొరంటో పబ్‌లో కాల్పులు

Mar 8,2025 23:56 #gunfire, #Shooting, #Toronto pub
  • 12మందికి గాయాలు

టొరంటో : తూర్పు టొరంటోలోని పబ్‌లో శుక్రవారం రాత్రి జరిగిన కాల్పుల్లో 12మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. రాత్రి 10.40గంటల ప్రాంతంలో ప్రోగ్రెస్‌ అవెన్యూకు సమీపంలోని పబ్‌లో పలువురిపై కాల్పులు జరిగినట్లు తమకు సమాచారం అందిందని పోలీసులు చెప్పారు. వీరిలో కొంతమందికి స్వల్ప గాయాలవగా, మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. తల వరకు నల్లని ముసుగు ధరించిన అనుమానితుడు సిల్వర్‌ రంగు కారులో పారిపోయాడని పోలీసులు తెలిపారు. ఆ వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఆ ప్రాంతంలో ఎవరూ బయట తిరగవద్దని ప్రజలను కోరారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నందున ఇప్పుడే ఏ వివరాలు తెలియవని టొరంటో మేయర్‌ చెప్పారు. అనుమానితుడు వద్ద అసాల్ట్‌ రైఫిల్‌, చేతి తుపాకులు వున్నాయని పోలీసులు తెలిపారు. ఆపబ్‌పై దాడి చేయడానికి ప్రత్యేక కారణమేమైనా వుందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

➡️